Mohammed Siraj: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సిరాజ్ పోస్ట్!
![Mohammed Siraj Lashes Out At Patriarchal Mindset Of Indians After Shocking Kolkata Rape Incident](https://imgd.ap7am.com/thumbnail/cr-20240817tn66c0000c237ce.jpg)
- యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కోల్‌కతా హత్యాచార ఘటన
- బాధితురాలికి న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు
- పురుషాధిక్య వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిరాజ్ సోషల్ మీడియా పోస్టు
కోల్‌కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మహిళల భద్రత, భారతీయ సమాజంలోని పితృస్వామ్య మనస్తత్వం ప్రధానాంశాలుగా మారాయి.
ఈ ఘటనపై తాజాగా సోషల్ మీడియా వేదికగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ స్పందించాడు. పితృస్వామ్య వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడీ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలాంటి ఘటనల్లో మహిళలదే తప్పు అంటారేమో అని అర్థం వచ్చేలా పలు వార్తా క్లిప్పింగులను పంచుకోవడం జరిగింది. ఇక సిరాజ్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ వంటి టీమిండియా క్రికెటర్లు కూడా ముందుకు వచ్చి కోల్‌కతా ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘోరమైన ఘటనను ఖండించడం జరిగింది.
ఇక సిరాజ్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ వంటి టీమిండియా క్రికెటర్లు కూడా ముందుకు వచ్చి కోల్‌కతా ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘోరమైన ఘటనను ఖండించడం జరిగింది.
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు రెడీ అవుతున్న సిరాజ్
వచ్చే నెల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్‌లకు ముందు చాలా మంది టీమిండియా స్టార్లు దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నారు. ఈ దేశవాళీ టోర్నీలో ఈ కుడిచేతి పేసర్ కూడా క్రికెట్ మైదానంలో కనిపించనున్నాడు. అభిమన్యు ఈశ్వరన్ నాయకత్వంలో ఇండియా-బీ జట్టు తరపున అతను బరిలోకి దిగనున్నాడు. రాబోయే కొన్ని నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. భారత జట్టు ఆడే ఈ భారీ టెస్ట్ సీజన్‌లో మహమ్మద్ సిరాజ్ కీలకం కానున్నాడు.