Botsa Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక

Botsa unanimously elected as MLC

  • విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స
  • బొత్సకు సర్టిఫికెట్ అందించిన రిటర్నింగ్ అధికారి
  • వైసీపీ శ్రేణుల్లో హర్షం

వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో బొత్స వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగగా... ఈ పోరుకు దూరంగా ఉండాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో బొత్సకు ఎదురులేకుండా పోయింది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచినట్టు బొత్సకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధృవపత్రం అందజేశారు. 

కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో షేక్ షఫీ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థి కూడా బరిలో దిగగా... ఆయన ఇటీవల తన నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దాంతో బొత్స ఒక్కరే రేసులో మిగిలారు. కాగా, ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత... ఈ తాజా విజయం వైసీపీలో ఆనందోత్సాహాలను కలిగించింది.

Botsa Satyanarayana
MLC
Local Bodies
Visakhapatnam
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News