FIR: వైద్యులపై దాడుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

Uinion govt takes key decision in attacks on medical staff

  • కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం
  • భద్రత కల్పించాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్న డాక్టర్లు
  • ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారాన్ని హెచ్ఓడీలకు అప్పగించిన కేంద్రం

వైద్యులపై, వైద్య సిబ్బందిపై దాడులు, ఇతర ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులు, ఇతర సిబ్బందిపై దాడి జరిగితే హెచ్ఓడీ వెంటనే స్పందించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం హెచ్ఓడీకి అప్పగించింది. దాడి జరిగిన 6 గంటల్లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తన ఆ పేర్కొంది. విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లు, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బందిపై దాడులను ఉపేక్షించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. 

కోల్ కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం ఘటన నేపథ్యంలో... తమ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డాక్టర్లు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ స్పందించారు. 

రోగులు, వారి బంధువులు డాక్టర్లపైనా, ఇతర వైద్య సిబ్బందిపైనా భౌతిక దాడులు చేస్తుండడం, అసభ్యకరంగా తిట్టడం వంటి ఘటనలు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో కేంద్రం ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారాన్ని హెచ్ఓడీలకు అప్పగించిందని గోయల్ వివరించారు. ఈ మేరకు దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News