Ram Charan: మెల్బోర్న్ ఫిలిం ఫెస్టివల్ లో రామ్ చరణ్ గ్రాండ్ ఎంట్రీ... వీడియో ఇదిగో!

Ram Charan gets grand welcome in Melbourne film festival

  • ఆగస్టు 15 నుంచి 25 వరకు ఆస్ట్రేలియాలో ఫిలిం ఫెస్టివల్
  • మెల్బోర్న్ నగరంలో ఈవెంట్
  • గౌరవ అతిథిగా రామ్ చరణ్ కు ఆహ్వానం
  • ఘనస్వాగతం పలికిన అభిమానులు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న మెల్బోర్న్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేశారు. మెల్బోర్న్ నగరంలో ఆగస్టు 15 నుంచి 25వ తేదీ వరకు ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) 15వ చలనచిత్రోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ కు గౌరవ అతిథిగా రామ్ చరణ్ కు ఆహ్వానం అందింది. 

ఈ నేపథ్యంలో, ఫిలిం ఫెస్టివల్ కు విచ్చేసిన రామ్ చరణ్ కు అపూర్వ స్వాగతం లభించింది. ఐఎఫ్ఎఫ్ఎమ్ వేదిక ప్రవాస భారతీయులతో క్రిక్కిరిసిపోయింది. వందలాంది మంది అభిమానులు రామ్ చరణ్ ను చూసేందుకు పోటెత్తారు. రామ్ చరణ్ ఎవరినీ నిరాశపర్చకుండా, అందరికీ అభివాదం చేస్తూ, ఓపిగ్గా సెల్ఫీలు ఇస్తూ ముందుకు సాగారు. 

బ్లాక్ సూట్లో, షేడెడ్ కూలింగ్ గ్లాసెస్ తో రామ్ చరణ్ ఈ ఈవెంట్  లో స్టయిలిష్ గా దర్శనమిచ్చారు. రామ్ చరణ్ తో పాటు అర్ధాంగి ఉపాసన కూడా ఈ కార్యక్రమంలో తళుక్కుమన్నారు.

More Telugu News