BJP: మమతా బెనర్జీ రాజీనామా చేయాలి: బీజేపీ నేత డిమాండ్
- దారుణానికి పాల్పడిన నిందితులను కాపాడుతున్నారని ఆగ్రహం
- నిందితులకు తృణమూల్ కాంగ్రెస్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణ
- ఈ కేసుపై ఇండియా కూటమి మౌనంగా ఎందుకు ఉందో చెప్పాలని నిలదీత
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఇందుకు కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్యాచారమే నిదర్శనమని... ఇందుకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ట్రైనీ డాక్టర్‌పై ఇంత దారుణానికి పాల్పడిన నిందితులను ఆమె కాపాడుతున్నారని ఆరోపించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాదీ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ... పశ్చిమ బెంగాల్‌లో చట్టబద్ధమైన పాలన లేదన్నారు.
ఈ కేసులోని నిందితులకు తృణమూల్ కాంగ్రెస్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అందుకే నిందితులకు రక్షించేందుకు మమతా బెనర్జీ ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఈ కేసులో ఒకరి కంటే ఎక్కువమంది నిందితులు ఉన్నట్లుగా అర్థమవుతోందన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ఈ అంశంపై ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని నిలదీశారు.