Ramcharan: రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన హాలీవుడ్ నటుడు లుకాస్ బ్రావో
![Hollywood actor Lucas Bravo praises RRR star Ramcharan](https://imgd.ap7am.com/thumbnail/cr-20240816tn66bf0832cc805.jpg)
- తాను 'ఆర్ఆర్ఆర్' సినిమా చూశానన్న లుకాస్ బ్రావో
- చరణ్ ఒక అద్భుతమైన నటుడని ప్రశంస
- చరణ్ ఎమోషనల్ ప్రెజెన్స్ ఉత్కంఠభరితంగా ఉంటుందన్న లుకాస్
'ఆర్ఆర్ఆర్' సినిమాలో అల్లూరి పాత్రకు జీవం పోసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటనకు భారతీయ సినీ ప్రేక్షకులే కాదు.. హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. గ్లోబల్ స్టార్ నటనను ఇప్పటికే ఎందరో హాలీవుడ్ స్టార్స్ ప్రశంసించారు. తాజాగా మరో హాలీవుడ్ యాక్టర్ లుకాస్ బ్రావో కూడా 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో రామ్‌చరణ్ నటనను ప్రశంసించారు. ఎమిలీ ఇన్ పారిస్‌కు సంబంధించిన ప్రమోషన్స్ సమయంలో ఇండియన్ సినిమాల్లో మీకు నచ్చిన నటుడు గురించి చెప్పమని బ్రావోను అడిగినప్పుడు... తాను 'ఆర్ఆర్ఆర్' సినిమా చూశానని... రామ్ చరణ్ ఒక అద్భుతమైన నటుడని కొనియాడారు. చరణ్ చేసే విన్యాసాలు, తెరపై ఆయన ఎమోషనల్ ప్రెజెన్స్ ఉత్కంఠభరితంగా ఉంటాయని పేర్కొన్నారు.
ఇండియన్ సినీ ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డును తెచ్చిన సినిమా మన తెలుగు సినిమా 'ఆర్ఆర్ఆర్'. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఈ ఘనతను దక్కించుకుంది. ఈ చిత్రంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించగా, తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1,200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే.