Anna Canteen bank account no.: అన్న క్యాంటీన్ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవే... విరాళాలు ఇవ్వండి: చంద్రబాబు

Chandrababu urges people for donations to Anna Canteens

  • రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన అన్న క్యాంటీన్లు
  • గుడివాడలో క్యాంటీన్ ను ప్రారంభించిన చంద్రబాబు
  • ఎస్బీఐలో అన్న క్యాంటీన్ అకౌంట్

ఏపీలో అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ క్యాంటీన్లలో కేవలం రూ. 5కే టిఫిన్, లంచ్, డిన్నర్ దొరుకుతాయి. 

మరోవైపు అన్న క్యాంటీన్ల ప్రారంభం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఎంతో మంది పేదలు తినడానికి తిండి లేక పస్తులు పడుకుంటున్న సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్యాంటీన్ల ద్వారా పేదల కడుపు నింపుతున్నామనే సంతోషం తనకు ఉందని చెప్పారు.

పేదలకు అన్నం పెట్టే ఈ మంచి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తమ వంతుగా ప్రజలు విరాళాలు ఇవ్వాలని కోరారు. అన్న క్యాంటీన్ బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించారు. 

అన్న క్యాంటీన్ బ్యాంకు ఖాతా వివరాలు:
బ్యాంకు - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
అకౌంట్ పేరు - అన్న క్యాంటీన్స్
అకౌంట్ నెంబర్ - 37818165097
IFSC - SBIN0020541 
బ్రాంచ్ - చంద్రమౌళి నగర్, గుంటూరు

  • Loading...

More Telugu News