Narendra Modi: ప్రధానిగా తన రికార్డును తానే బద్దలుకొట్టిన మోదీ

PM Modi longest speech

  • స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోదీ సుదీర్ఘ ప్రసంగం
  • 98 నిమిషాల పాటు కొనసాగిన స్పీచ్
  • గతంలో 72 నిమిషాల పాటు ప్రసంగించిన నెహ్రూ

వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలను చేపట్టి రికార్డు పుటల్లోకెక్కిన మోదీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఏకధాటిగా 98 నిమిషాల పాటు ప్రసంగించారు. అంటే... ఆయన ప్రసంగం గంటన్నరకు పైగా కొనసాగింది. 2016లో ఆయన 96 నిమిషాల పాటు ప్రసంగించి అత్యధిక సమయం ప్రసంగించిన పీఎంగా ఘనత సాధించారు. ఇప్పుడు ఆయన రికార్డును ఆయనే అధిగమించారు. 

1947 లో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 72 నిమిషాల పాటు ప్రసంగించారు. మోదీకి ముందువరకు నెహ్రూదే అత్యధిక సమయం ప్రసంగించిన రికార్డు. నెహ్రూకు మరో రికార్డు కూడా ఉంది. 1954లో అత్యల్పంగా 14 నిమిషాలు మాత్రమే ఆయన ప్రసంగించారు. 1966లో ఇందిరాగాంధీ కూడా 14 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు.

Narendra Modi
BJP
Speech
Record
  • Loading...

More Telugu News