Rega KanthaRao: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఎఫెక్ట్.. రేగ కాంతారావు ముందస్తు అరెస్టు

BRS Former MLAs Precautionary Arrest Due To CM Tour

  • బానోత్ హరిప్రియను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • భద్రాద్రి జిల్లాకు నీళ్లు ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యేల ఆందోళన
  • వైరాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల అరెస్టు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఖమ్మం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళనలను అడ్డుకునే క్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, బానోత్ హరిప్రియలను ముందస్తు అరెస్టు చేశారు. వైరాలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన ఏన్కూరు లింక్ కెనాల్ నుంచి వైరా రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేస్తారు. దీంతో గోదావరి జలాలు మరికొన్ని గంటల్లోనే తొలిసారిగా ఖమ్మం జిల్లాకు చేరనున్నాయి.

పంప్ హౌజ్ ప్రారంభోత్సవం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైరా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు. రూ. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి నిధులను విడుదల చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీఎం టూర్ సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, బానోత్ హరిప్రియ ఆందోళన చేపట్టారు. దీంతో వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Rega KanthaRao
Banoth Haripriya
Khammam
CM Tour
Sitarama Project
BRS Protests
  • Loading...

More Telugu News