Virat Kohli: లండ‌న్ వీధుల్లో సామాన్యుడిలా విరాట్ కోహ్లీ.. నెట్టింట‌ వీడియో వైర‌ల్‌!

Virat Kohli on the London streets Video goes Viral on Social Media

  • లండ‌న్ వీధుల్లో షికార్లు చేస్తున్న కోహ్లీ
  • శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్ త‌ర్వాత‌ నేరుగా కొలంబో నుంచి లండ‌న్ వెళ్లిన విరాట్‌
  • కుమారుడు అకాయ్ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఫ్యామిలీతో క‌లిసి లండ‌న్‌లోనే మ‌కాం  

టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ లండ‌న్ వీధుల్లో షికార్లు చేస్తున్నాడు. సామాన్య‌డిలా రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తూ క‌నిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వీడియోలో రోడ్డు దాటేందుకు విరాట్ ఫుట్‌పాత్‌పై నిల‌బ‌డి ఉండ‌టం క‌నిపించింది. 

కాగా, శ్రీలంక‌తో మూడు మ్యాచుల వ‌న్డే సిరీస్ ముగిసిన వెంట‌నే ఆయ‌న నేరుగా కొలంబో నుంచి లండ‌న్ వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. ఇక కుమారుడు అకాయ్ పుట్టిన‌ప్ప‌టి నుంచి విరాట్ కోహ్లీ త‌న ఫ్యామిలీతో క‌లిసి లండ‌న్‌లోనే ఉంటున్నాడు. 

విండీస్‌, యూఎస్ వేదిక‌గా జ‌రిగిన‌ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన త‌ర్వాత స్వ‌దేశానికి వ‌చ్చిన ర‌న్‌మెషిన్ ఇక్క‌డ ఢిల్లీ, ముంబైల‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న త‌ర్వాత లండ‌న్‌లో ఉంటున్న‌ భార్య అనుష్క శ‌ర్మ‌, కూతురు వామిక‌, కొడుకు అకాయ్ ద‌గ్గ‌రికి వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌ళ్లీ శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్ కోసం తిరిగి వ‌చ్చాడు. ఈ సిరీస్ ముగిసిన వెంట‌నే మ‌ళ్లీ లండ‌న్ విమానం ఎక్కేశాడు.

More Telugu News