Nasa Video: భూమిపై ఆకుపచ్చని ‘అరోరా’ కాంతులు... స్పేస్​ నుంచి తీసిన వీడియో ఇదిగో!

video from space shows green Auroras amid moonset

  • సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్ వికిరణాల ప్రభావం
  • భూమి అయస్కాంత శక్తి అడ్డుకోవడంతో.. రంగురంగుల కాంతులు
  • అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వీడియో చిత్రీకరణ

భూమి వాతావరణంలో ఏర్పడిన అద్భుత కాంతులను నాసా వ్యోమగామి మ్యాథ్యూ డొమినిక్ చిత్రీకరించారు. సూర్యుడిపై జరిగే పేలుళ్లతో వెలువడే రేడియేషన్ వికిరణాలు భూవాతావరణంలోకి ప్రవేశించకుండా.. భూమి అయస్కాంత శక్తి అడ్డుకుంటుంది. 

ఈ సమయంలో... ఆ వికిరణాల స్థాయిని బట్టి ఎరుపు, ఆకుపచ్చ, వయోలెట్ రంగుల్లో కాంతులు ఏర్పడుతాయి. వీటిని అరోరాలుగా పిలుస్తారు. సాధారణంగా భూమి ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద, వాటికి సమీపంలో ఉన్న దేశాల్లో ఈ అరోరాలు కనిపిస్తూ ఉంటాయి. అదే అంతరిక్షం నుంచి చూస్తే మాత్రం.. చాలా భారీ స్థాయిలో కనిపిస్తాయి.

ఐఎస్ఎస్ నుంచి చిత్రీకరించి..
  • భూమి వాతావరణం పైపొరల్లో ఏర్పడే ఈ అరోరాలను.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి నాసా వ్యోమగామి మ్యాథ్యూ డొమినిక్ వీడియో తీశారు. దానిని తాజాగా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
  • ఐఎస్ఎస్ భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో.. ఓ రాత్రిపూట ఈ అరోరాలు ఏర్పడటం, చంద్రుడు అస్తమించడం వంటి విశేషాలు ఈ వీడియోలో ఉన్నాయి.
  • తన కెమెరాకు ఇటీవలే కొత్త లెన్స్ కొనుక్కుని.. ఐఎస్ఎస్ కు తెచ్చుకున్నానని.. వాటితో అద్భుతమైన వీడియో తీసే అవకాశం లభించిందని మ్యాథ్యూ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
  • ఈ వీడియోకు ఇప్పటివరకు ఆరున్నర లక్షలకుపైగా లైకులు, వేలకొద్దీ షేరింగ్ లు వచ్చాయి.

  • Loading...

More Telugu News