UGC NET 2024: ఈ నెల 26న జరగాల్సిన యూజీసీ నెట్-2024 పరీక్ష వాయిదా

The National Testing Agency has postponed the UGC NET 2024 Exam scheduled to August 27 from August 26

  • మరుసటి రోజు 27కు రీషెడ్యూల్
  • శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా తేదీలో మార్పు
  • కీలక అప్‌డేట్ ఇచ్చిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

యూజీసీ నెట్ 2024 ఎగ్జామ్‌కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల (ఆగస్టు) 26న జరగాల్సిన పరీక్షను మరుసటి రోజు (ఆగస్టు27)కు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. ఈ నెల 26న శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ఆ రోజు నిర్వహించాల్సిన పరీక్షను రీషెడ్యూల్ చేసినట్టు వివరించింది. ఇందుకు సంబంధించిన అప్‌డేట్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది.

కాగా యూజీసీ నెట్ పరీక్షలు ఆగస్ట్ 21 మొదలై సెప్టెంబర్ 4 వరకు కొనసాగనున్నాయి. ఆగస్టు నెలలో 21, 22, 23, 27 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు, షెడ్యూల్‌కు సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే 011-40759000 లేదా ugcnet@nta.ac.in ఈ-మెయిల్‌ను అభ్యర్థులు సంప్రదించవచ్చునని సూచించింది. 

కాగా అధికారిక వెబ్‌సైట్‌ లో (ugcnet.nta.ac.in) పరీక్షకు సంబంధించిన ‘ఎగ్జామ్ సిటీ స్లిప్'ను విడుదల చేసింది. ఈ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఏ నగరంలో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందో తెలుసుకోవచ్చు. 

ఇక, యూజీసీ నెట్ 2024 అడ్మిట్ కార్డ్‌లను టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేయనుంది. అడ్మిట్ కార్డులను దశల వారీగా విడుదల చేసే అవకాశాలున్నాయి. పరీక్షల ప్రారంభానికి 10 రోజుల ముందు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందుబాటులో ఉంచనుంది. అభ్యర్థులు తదుపరి అప్‌డేట్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేస్తూ ఉండాలి.

  • Loading...

More Telugu News