Chandrababu: ఇవన్నీ మనలో జాతీయ భావాన్ని కల్పిస్తాయి: సీఎం చంద్రబాబు

Chandrababu conveys advanced wishes on Independence Day

  • రేపు (ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవం
  • ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
  • ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని పిలుపు 

రేపు (ఆగస్టు 15) భారతదేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనుండగా, ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు ముందుస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని ప్రస్తావించారు. 

"మహోజ్వల చరిత గల మన దేశ సమగ్రతను కాపాడడం మనందరి కర్తవ్యం. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అనుసరించి వరుసగా మూడో ఏడాది 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. 'ఇంటింటా జాతీయ జెండా' అనే ఈ కార్యక్రమం మరింత విస్తరించడం ఆనందకర విషయం.

మరీ ముఖ్యంగా... మన తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం జాతీయ జెండా రూపంలో ప్రతి ఇంటిపై ఎగరడం మనకు మరింత ప్రత్యేకం, గర్వకారణం. రేపు ప్రతి ఇంటిపై, ప్రతి కార్యాలయంపై మన మువ్వన్నెల జాతీయ జెండాను రెపరెపలాడించండి. 

అంతేకాదు, జాతీయ జెండాను మీ సోషల్ మీడియా పేజీలలో ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోండి. ఇవన్నీ మనలో జాతీయ భావాన్ని కల్పిస్తాయి, స్ఫూర్తిని నింపుతాయి. అందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News