Devara: ఇది చాలా అద్భుతమైన ప్రయాణం.. 'దేవ‌ర పార్ట్‌-1' షూటింగ్ ముగింపుపై తార‌క్ ట్వీట్‌!

Jr NTR Tweet on Devara Part1 Shooting Completed

  • ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో 'దేవ‌ర‌'
  • రెండు భాగాలుగా తెరకెక్కుతున్న మూవీ
  • పార్ట్‌-1 షూటింగ్ కంప్లీట్ చేసిన‌ట్లు ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించిన తార‌క్‌
  • సెప్టెంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న 'దేవ‌ర‌'

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, డైరెక్ట‌ర్ కొరటాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం 'దేవ‌ర'. 'జన‌తా గ్యారేజ్' వంటి సూప‌ర్ హిట్‌ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో ఈ మూవీ వ‌స్తుండ‌టంతో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన మూవీ క్లిప్స్‌, ఆడియో సాంగ్స్‌, పోస్ట‌ర్లకు మంచి స్పంద‌న ల‌భించింది. 

ఇక రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో తార‌క్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌నున్నారు. త‌మిళ యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుద్ బాణీలు అందిస్తున్నాడు. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ పతాకాలపై సుధాకర్‌, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. 

కాగా, ఈ మూవీ పార్ట్‌-1 షూటింగ్ ముగించిన‌ట్లు తాజాగా హీరో ఎన్‌టీఆర్ ట్వీట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా? ఎప్పుడు అప్‌డేట్ ఇస్తారా? అని ఎదురుచూస్తున్న అభిమానుల‌కు తార‌క్ ఈ ట్వీట్‌తో గుడ్ న్యూస్ చెప్పారు. 

"దేవ‌ర సినిమాకు సంబంధించి పార్ట్ 1 షూటింగ్‌ను ముగించాను. ఇది చాలా అద్భుతమైన ప్రయాణం. మహా సముద్రమంత ప్రేమను పంచిన టీంను మిస్ అవుతాను. కొర‌టాల శివ రూపొందించిన దేవ‌ర ప్ర‌పంచంలోకి సెప్టెంబ‌ర్ 27న క‌లుద్దాం" అని ట్వీట్ చేశారు. అలాగే షూటింగ్ లోకేష‌న్‌లో ద‌ర్శ‌కుడితో క‌లిసి ఉన్న ఓ ఫొటోను ఈ ట్వీట్‌కు జ‌త చేశారు.

More Telugu News