Hardik Pandya: సింగర్ తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. గ్రీస్ లో విహారయాత్ర?

Hardik Pandya Dating With Britan Singer Jasmin Walia

  • నాలుగు రోజుల వ్యవధిలో సేమ్ లొకేషన్ లో ఫొటోలు
  • దీంతో ఇద్దరూ కలిసే వెళ్లారంటూ సోషల్ మీడియాలో ప్రచారం
  • గత నెలలోనే భార్య నటాషాతో విడిపోయిన పాండ్యా

స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా బ్రిటన్ సింగర్ జాస్మిన్ వాలియాతో ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం వారిద్దరూ గ్రీస్ లో విహరిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హార్దిక్ పాండ్యా తన ఇన్ స్టాలో షేర్ చేసిన తాజా వీడియోతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. పాండ్యా ప్రస్తుతం గ్రీస్ లో సేదతీరుతున్నాడు. తన హోటల్ లోని స్విమ్మింగ్ పూల్ ముందు నడుస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ వీడియోకు బ్రిటన్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియా లైక్ కొట్టారు. నాలుగు రోజుల క్రితం సరిగ్గా ఇదే ప్లేస్ లో వాలియా కూడా ఫొటో దిగి ఇన్ స్టాలో షేర్ చేశారు. ఈ పోస్టుకు పాండ్యా లైక్ కొట్టాడు. గతంలోనూ వాలియా పెట్టిన పలు పోస్ట్‌లకు పాండ్య కామెంట్లు చేశాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కలిసే విహారయాత్రకు వెళ్లారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

జాస్మిన్ వాలియా ఎవరంటే..
బ్రిటన్ కు చెందిన జాస్మిన్ వాలియా నటి, సింగర్, యూట్యూబర్.. నివాసం ఇంగ్లాండ్ లోని ఎసెక్స్. టీవీ షోలు, రియాల్టీ షోల ద్వారా అభిమానులను సంపాదించుకుంది. సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి పలు ఆల్బమ్ లు చేసింది. ఆమె పాడిన ‘బామ్ డిగీ’ పాటను బాలివుడ్ సినిమాలో రీమేక్ చేశారు. బాలీవుడ్ సింగర్ ఆసిమ్ రియాజ్ తో కలిసి జాస్మిన్ ఓ మ్యూజిక్ వీడియో చేసింది.

నటాషాతో విడిపోయిన పాండ్యా
సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్ పాండ్యా.. గత నెలలో తన వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఈ జంట సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అభిమానులను షాక్ కు గురిచేసింది. కొడుకు అగస్త్యను తీసుకుని నటాషా తన మాతృదేశం సెర్బియాకు వెళ్లిపోయింది. అప్పటినుంచి వీరికి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తూనే ఉంది.

View this post on Instagram

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

More Telugu News