kamikaze drones: భారత్ అమ్ములపొదిలో శత్రుభీకర 'కమికాజే' డ్రోన్లు

Hostile kamikaze drones in Indias Ammulapodi

  • స్వదేశీ పరిజ్ఞానం, సాంకేతికతో ఆత్మాహుతి డ్రోన్ లు 'కమికాజే'ను ఆవిష్కరించిన హెచ్ఏఎల్
  • ఉక్రెయిన్ – రష్యా వార్ లో విజయవంతంగా లక్ష్యాలను ఛేదించిన ఈ తరహా డ్రోన్ లు
  • గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెయ్యి కిలోమీటర్ల పరిధి వరకూ లక్ష్యాలను ఛేదించగల సత్తా 

భారత్ అమ్ముల పొదిలోకి శత్రుభీకర 'కమికాజే' డ్రోన్లు చేరాయి. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ, స్వదేశీ ఇంజిన్ ఈ ఆత్మాహుతి డ్రోన్ లను నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (ఎన్ఎఎల్) తయారు చేస్తోంది. భారతదేశం ఆవిష్కరించిన ఈ 'కమికాజే' డ్రోన్ లు యుద్ధరంగంలో కీలకంగా మారబోతున్నాయి.

వీటి ప్రత్యేకత ఏమిటంటే..?
మానవ రహిత ఈ వైమానిక విమానాల (కమికాజే డ్రోన్లు) ప్రత్యేకత ఏమిటంటే.. వెయ్యి కిలో మీటర్ల పరిధి వరకూ ప్రయాణించి శత్రువుల లక్ష్యాలపై దాడులు చేయగలవు. 120 కిలోల పేలుడు పదార్ధాలను మోస్తూ గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఒకేసారి అనేక డ్రోన్ లను ప్రయోగించి, రాడార్లు, శత్రువుల రక్షణ వ్యవస్థను అధిగమించి దాడులు చేయగలవు. భారత్ తయారు చేస్తున్న కమికాజే డ్రోన్ లు 2.8 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పు రెక్కలు కలిగి ఉంటాయి. ఒకసారి ఆకాశంలోకి వెళ్తే తొమ్మిది గంటల వరకూ ప్రయాణించగలవు. నిర్దిష్టమైన లక్ష్యాలపై నిఘాతో క్రాష్ చేసి దాడులు చేయగలవు. వీటిలో 30 హార్స్ పవర్ ఇంజన్ ఉపయోగిస్తున్నారు. రిమోట్ కంట్రోల్ తో వీటిని నియంత్రిస్తూ లక్ష్యాలపై దాడులు చేయవచ్చు.

యుద్దరంగంలో గేమ్ ఛేంజర్ లుగా ఈ డ్రోన్ లు
అప్రతిహతంగా సాగుతున్న ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో ఈ డ్రోన్ లను ఎక్కువగా ఉపయోగించారు. రష్యన్ పదాతి దళాల లక్ష్యంగా ఉక్రెయిన్ ఈ డ్రోన్ లను ప్రయోగించి మెరుగైన ఫలితాలను సాధించింది. కమికాజే ఆత్మాహుతి మిషన్లు మొదటి ప్రపంచ యుద్ధం– 2 ముగింపులో కనిపించాయి. జపాన్ వైమానిక దళం క్షీణించిన తర్వాత వారి పైలట్లు అమెరికా దాని మిత్ర రాజ్యాల విమానాలు, నౌకలపైకి సూసైడ్ మిషన్లు గా వీటితో దాడులకు పాల్పడ్డారు.

More Telugu News