Telco: స్పామ్ కాల్స్‌పై టెల్కోలకు ట్రాయ్ కీలక ఆదేశాలు

TRAI Directs Telcos To Disconnect Unregistered Telemarketers

  • వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే బ్లాక్ చేయాలన్న ట్రాయ్
  • పదిహేను రోజులకోసారి రెగ్యులర్ అప్ డేట్స్ సమర్పించాలని సూచన
  • ఈ నిర్ణయంతో స్పామ్ కాల్స్ నుంచి ఉపశమనం లభిస్తుందని వెల్లడి

రిజిస్టర్ కాని టెలీమార్కెటర్లు స్పామ్ కాల్స్ చేస్తున్నట్లు గుర్తించిన టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ మంగళవారం టెల్కోలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే అలాంటి నెంబర్‌ను రెండేళ్లు బ్లాక్ చేయాలని టెల్కోలను ఆదేశించింది. స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌కు పెద్ద ఎత్తున కనెక్షన్లు వాడే సంస్థలను బ్లాక్ లిస్టులో చేర్చాలని పేర్కొంది.

తమ తాజా ఆదేశాలు పాటించాలని, తీసుకున్న చర్యలపై పదిహేను రోజులకోసారి రెగ్యులర్ అప్ డేట్స్ సమర్పించాలని సూచించింది. ఈ నిర్ణయాత్మక చర్యతో వినియోగదారులకు స్పామ్ కాల్స్ నుంచి ఉపశమనం లభిస్తుందని ట్రాయ్ పేర్కొంది. పెరుగుతున్న సైబర్ నేరాలను, స్పామ్ కాల్స్ పేరుతో పెరుగుతున్న నేరాలను గుర్తించిన ట్రాయ్ ఈ ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News