Leopart: శ్రీశైలంలో పాతాళగంగకు వెళ్లే మార్గంలో చిరుతపులి సంచారం
- ఏఈవో ఇంటి ప్రహరీగోడపై నడుచుకుంటూ వెళ్లినట్లుగా సీసీటీవీ ఫుటేజీ
- కుక్కను ఎత్తుకెళ్లిన చిరుతపులి
- పలువురి ఇళ్లముందు తెల్లవారుజామున చిరుత జాడ
శ్రీశైలంలో చిరుతపులి సంచారం భక్తులను భయాందోళనలకు గురి చేసింది. పాతాళగంగకు వెళ్లే మార్గంలోని ఆలయ ఏఈవో ఇంటి వద్ద చిరుత కనిపించింది. ఏఈవో ఇంటి ప్రహరీ గోడపై చిరుత నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. చిరుత నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్న కుక్కను ఎత్తుకెళ్లినట్లుగా వీడియోలో ఉంది. ఆ తర్వాత పలువురి ఇళ్లముందు కూడా ఈరోజు తెల్లవారుజామున చిరుత జాడ కనిపించింది.
దీంతో స్థానికులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసంచార ప్రదేశంలో తిరిగినట్లుగా తెలియడంతో చాలామంది బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. చిరుతపులి సంచారానికి సంబంధించి స్థానికులు అటవీ అధికారులకు తెలియజేశారు. విషయం తెలియగానే చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు వచ్చారు.