Duvvada Srinivas: మాధురి పెట్రోలు బంకు పునరుద్ధరణ కోసం అధికారికి దువ్వాడ బెదిరింపులు.. కలకలం రేపుతున్న ఆడియో ఇదిగో!

YSRCP MLC Duvvada Srinivas Warns Official About Madhuri Petrol Bunk

  • శ్రీకాకుళం జిల్లా తలగాం వద్ద మాధురి పెట్రోలు బంక్
  • దానిని పునరుద్ధరించాలంటూ అధికారికి దువ్వాడ ఫోన్
  • దాని అనుమతులు రద్దయ్యాయని, పునరుద్ధరణ సాధ్యం కాదన్న అధికారి
  • తాను రోడ్‌సైడ్ వ్యక్తిని కాదంటూ దువ్వాడ హెచ్చరిక

వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ.. పెట్రోలు రిఫైనరీ సంస్థ అధికారిని ఫోన్‌లో బెదిరిస్తూ ఆయన మాట్లాడిన ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. ప్రస్తుత వివాదంలో సెంటరాఫ్ అట్రాక్షన్ అయిన మాధురికి శ్రీకాకుళం జిల్లా తలగాం గ్రామ కూడలిలోని పెట్రోలు బంకు అనుమతులను తక్షణమే పునరుద్ధరించాలంటూ సంబంధిత రిఫైనరీ అధికారిని తీవ్ర స్వరంతో బెదిరించారు.

అయితే, ఆ బంకుకు అనుమతులు ఎప్పుడో రద్దయ్యాయని, డీలర్‌షిప్ కూడా తొలగించామని, కాబట్టి పునరుద్ధరణ సాధ్యంకాదని అధికారి బదులిచ్చారు. అసలు ఈ విషయంలో సంబంధిత వ్యక్తే మాట్లాడాలని, మీరెలా మాట్లాడతారని అధికారి ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్సీ కోపంతో ఆయనతో వాగ్వివాదానికి దిగారు. తానెందుకు మాట్లాడకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్సీనని, రోడ్‌సైడ్ వ్యక్తిని కాదంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాను డీఎంతో మాట్లాడానని, అయినప్పటికీ ఎందుకు చేయవని అధికారిని దువ్వాడ ప్రశ్నించారు. దువ్వాడ గొంతు పెంచడంతో.. అరవొద్దని అధికారి సూచించారు.

  • Loading...

More Telugu News