Revanth Reddy: సౌత్ కొరియాలో రేవంత్ రెడ్డి బృందం పర్యటన... హ్యుండాయ్ అధికారులతో భేటీ

Revanth Reddy touring in South Korea

  • తెలంగాణలో కార్ల మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత
  • హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ కార్యాలయ విస్తరణకు ఓకే
  • హ్యుండాయ్ అనుబంధ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టనుందన్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందం నేడు దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. సియోల్‌లోని హ్యుండాయ్ మోటార్ కంపెనీ అధికారులతో వారు సమావేశమయ్యారు. తెలంగాణలో హ్యుండాయ్ మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు ఎలక్ట్రికల్ వాహనాలు సహా అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సదుపాయం ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది.

హైదరాబాద్‌లో ఉన్న ఇంజినీరింగ్ కార్యాలయాన్ని విస్తరిస్తామని హ్యుండాయ్ తెలిపింది. భారతీయ వినియోగదారుల కోసం బెంచ్ మార్క్ ఉత్పత్తులు, సాంకేతికత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హ్యుండాయ్ ప్రతినిధులు... ముఖ్యమంత్రి బృందానికి తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... హ్యుండాయ్ మోటార్ తన అనుబంధ సంస్థ హెచ్ఎంఐఈ ద్వారా తెలంగాణలో కారు టెస్టింగ్ సదుపాయాన్ని నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టడంపై ప్రణాళికలు రచిస్తోందన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానాల నేపథ్యంలో హెచ్ఐఎంఈ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

  • Loading...

More Telugu News