Rahul Gandhi: మోదీ 3.0లో స్టాక్ మార్కెట్ దూకుడు... 5 నెలల్లో రూ.46 లక్షలు ఆర్జించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi made Rs 46 lakh profit in just 5 months

  • మార్చి 15న రూ.4.33 కోట్లుగా ఉన్న స్టాక్స్ వ్యాల్యూ రూ.4.80 కోట్లకు చేరిన వైనం
  • నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న షేర్ల వ్యాల్యూ ఆధారంగా లెక్కింపు
  • నాలుగు మినహా లాభాల్లోనే రాహుల్ గాంధీ పోర్ట్‌పోలియోలోని స్టాక్స్

భారత స్టాక్ మార్కెట్ వృద్ధిపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు. మోదీ 3.0 వచ్చాక ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఇదే కాలంలో స్టాక్ మార్కెట్‌లోని తన పెట్టుబడుల ద్వారా రాహుల్ గాంధీ రూ.46.49 లక్షల ఆదాయాన్ని ఆర్జించినట్లు డేటా వెల్లడిస్తోంది.

2024 మార్చి 15 నాటికి రాహుల్ గాంధీ స్టాక్స్ విలువ రూ.4.33 కోట్లు కాగా,  2024 ఆగస్ట్ 12 నాటికి రూ.4.80 కోట్లకు పెరిగింది. రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల సమయంలో రాయ్‌బరేలీ నియోజకవర్గంలో వేసిన నామినేషన్‌లో తన షేర్ల వాల్యూను పేర్కొన్నారు. వీటి ఆధారంగా రాహుల్ గాంధీ స్టాక్స్ వాల్యూను లెక్కించారు.

రాహుల్ గాంధీ పోర్ట్‌పోలియోలో ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఫైనాన్స్, దీపక్ నైట్రేట్, దివిస్ ల్యాబ్స్, జీఎంఎం పిఫాడ్లర్, హిందూస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, ఐటీసీ, టీసీఎస్, టైటాన్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా, ఎల్‌టీఐ మైండ్ ట్రీ తదితర 24 స్టాక్స్ ఉన్నాయి.

ఈరోజు నాటికి ఎల్‌టీఐ మైండ్ ట్రీ, టైటాన్, టీసీఎస్, నెస్లే ఇండియా... ఈ నాలుగు స్టాక్స్‌లో మాత్రమే ఆయన నష్టాలను చూస్తున్నారు. మిగతా అన్ని స్టాక్స్ లాభాల్లోనే ఉన్నాయి. వెర్డోజ్ అడ్వర్టైజ్‌మెంట్ లిమిటెడ్, వినైల్ కెమికల్స్ వంటి చిన్న కంపెనీల స్టాక్స్‌లోనూ ఆయన ఇన్వెస్ట్ చేశారు.

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ భారీ లాభాలను చూస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీలు గత కొన్ని నెలల్లోనే పలు రికార్డులను నమోదు చేస్తూ కొత్త గరిష్ఠాలను చేరుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి సెన్సెక్స్ 11 శాతం, నిఫ్టీ 12 శాతం రాబడులను ఇచ్చాయి.

  • Loading...

More Telugu News