All Aravind: మనవడికి బౌలింగ్ చేసిన అల్లు అరవింద్... వీడియో ఇదిగో!

Allu Aravind plays cricket with Ally Ayan

 


వృద్ధులు అన్నాక మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేయడం సహజం. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా అందుకు మినహాయింపు కాదు. తన మనవడు అల్లు అయాన్ తో కలిసి ఆయన క్రికెట్ ఆడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. 

ఎంతో బిజీగా ఉండే అల్లు అరవింద్... దొరికిన కొద్దిపాటి విరామంలో క్రికెట్  ఆడి సేద దీరారు. మనవడు అల్లు అయాన్ బ్యాటింగ్  చేస్తుండగా, అల్లు అరవింద్ బౌలింగ్ చేశారు. తమ ఇంటి కాంపౌండ్ లో జరిగిన తాతామనవడి క్రికెట్ మ్యాచ్ ను అల్లు అర్జున్ అర్ధాంగి స్నేహారెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఐకాన్ స్టార్ అభిమానులు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. 


All Aravind
All Ayan
Cricket
Allu Arjun
Sneha Reddy

More Telugu News