Kanguva: సూర్య 'కంగువ' ట్రైల‌ర్ విడుద‌ల‌

Kanguva Movie Trailer Released

  • హీరో సూర్య, మాస్ డైరెక్టర్ శివ కాంబోలో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా ‘కంగువ’
  • విల‌న్‌గా న‌టిస్తున్న బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్
  • సూర్య స‌ర‌స‌న హీరోయిన్‌గా దిశా ప‌టానీ 
  • అక్టోబ‌ర్ 10న మూవీ విడుద‌ల

హీరో సూర్య, మాస్ డైరెక్టర్ శివ కాంబోలో తెరకెక్కిన‌ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం... ‘కంగువ’. బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నాయి. ఇప్పటికే విడుద‌ల‌యిన మూవీ గ్లింప్స్, సాంగ్స్, టీజర్ తో భారీ అంచనాలు నెల‌కొన్నాయి.

తాజాగా కంగువ ట్రైలర్ ను మేక‌ర్స్‌ విడుదల చేశారు. ట్రైల‌ర్‌లో సూర్య‌, బాబీ డియోల్ ప‌వ‌ర్‌ఫుల్ గా క‌నిపించారు. దిశా ప‌టానీ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, రాక్‌స్టార్ దేవివ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న మూవీ విడుద‌ల కానుంది.

Kanguva
Kanguva Movie Trailer
Suriya
Bobby Deol

More Telugu News