Divvela Madhuri: దివ్వెల మాధురిపై పోలీస్ కేసు

Case registered against Divvela Madhuri

  • కారు ప్రమాదంపై కేసు పెట్టిన పోలీసులు
  • ప్రమాదం కాదు.. ఆత్మహత్యాయత్నమన్న మాధురి
  • వాణి ఆరోపణలతో డిప్రెషన్ కు గురయ్యానని వెల్లడి

వైసీపీ నాయకురాలు దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మాధురి ప్రస్తుతం పలాసలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, నిర్లక్ష్యంగా కారును నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యారని మాధురిపై పలాస పోలీసులు కేసు పెట్టారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 125 ప్రకారం ఆమెపై అభియోగాలు నమోదు చేశారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో మాధురి కలిసి ఉంటోందని, తన భర్తను తనకు కాకుండా చేసిందని దువ్వాడ వాణి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వాణి తన కూతురు హైందవితో కలిసి టెక్కలిలోని దువ్వాడ ఇంటి ముందు నిరసన చేస్తున్నారు. ఇంట్లోకి అనుమతించాలని గత నాలుగు రోజులుగా రాత్రీపగలు అక్కడే ఉంటున్నారు. ఈ గొడవకు సంబంధించి మీడియా ముఖంగా వాణి, మాధురి పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. దీంతో టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ నివాసంపై తనకూ హక్కు ఉందని, ఇకపై పిల్లలతో కలిసి అక్కడే ఉంటానని మాధురి ఆదివారం ప్రకటించారు.

సాయంత్రం తన కారులో టెక్కలికి బయలుదేరారు. ఈ క్రమంలోనే పలాస హైవేపై లక్ష్మీపురం టోల్‌గేట్‌ దగ్గర మాధురి నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న కారును వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో మాధురికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ.. ఇది రోడ్డు ప్రమాదం కాదని, వాణి ఆరోపణలతో డిప్రెషన్ కు గురై తానే ఆ కారును ఢీ కొట్టానని మాధురి చెప్పారు. జరుగుతున్న పరిణామాలతో విసుగుచెంది చనిపోవాలనే ఉద్దేశంతో యాక్సిడెంట్ చేశానన్నారు.

Divvela Madhuri
Police Case
Tekkali
Duvvada Srinivas
YSRCP MLC
Road Accident
  • Loading...

More Telugu News