: హజారే జనతంత్ర యాత్ర మళ్లీ షురూ
అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న సామాజికవేత్త అన్నా హజారే నాలుగో విడత జనతంత్ర యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 23న ఉత్తరప్రదేశ్ లో ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర తరువాత ఢిల్లీ రాంలీలా మైదాన్ లో అవినీతి వ్యతిరేక జనలోక్ పాల్ బిల్లు అమలు కోసం మరోసారి ధర్నాకు దిగనున్నారు. గత వారమే కేంద్రం జనలోక్ పాల్ బిల్లును తనకు మాట ఇచ్చిన ప్రకారం అమలు చేయనందున మరోసారి ధర్నాకు కూర్చోనున్నానని అన్నాహజారే హెచ్చరించారు. అందుకు సన్నాహాలు కూడా మొదలు పెట్టారు ఆయన.