Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్

Telangana Speaker Gaddam Prasad met CM Chandrababu

  • ఏపీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపిన తెలంగాణ స్పీకర్  
  • సీఎం చంద్రబాబుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక వినతి
  • టీటీడీలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను అనుమతించాలని కోరిన స్పీకర్ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమావేశమయ్యారు. గడ్డం ప్రసాద్ కుమార్ ఆదివారం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లగా ఆయన పుఫ్పగుచ్చం అందించి సాదరంగా స్వాగతించారు. శాలువాతో సత్కరించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ .. ఏపీ సీఎం చంద్రబాబు తో సమావేశం కావడం హాట్ టాపిక్ అయ్యింది. కాగా ఏపీ సీఎం చంద్రబాబును ఎందుకు కలవడం జరిగింది? అనే దానిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుప్పగుచ్చం అందజేసినట్లు  వెల్లడించారు. 

తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి మరియు దర్శనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుల సిఫార్సు లేఖలకు అర్హత కల్పించాలని సీఎం చంద్రబాబుకు వినతిని అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. గతంలో తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో అనుమతించే వారు. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు మారిన తర్వాత టీటీడీ అధికారులు తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసనసభ్యుల అభ్యర్ధనను స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆదివారం ఏపీ చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. అయితే తన విజ్ఞప్తిపై ఏపీ సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారా? లేదా? అనేది మాత్రం స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడించలేదు. దీనిపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.

Chandrababu
Chief Minister
Andhra Pradesh
Gaddam Prasad
Telangana Speaker
TTD
  • Loading...

More Telugu News