Divvela Madhuri: దువ్వాడ ఇష్యూలో ట్విస్ట్... రోడ్డు ప్రమాదంలో దివ్వెల మాధురికి గాయాలు, ఆసుపత్రిలో చికిత్స

Divvela Maduri injured in accident

  • లక్ష్మీపురం టోల్ గేట్ సమీపంలో కారు ప్రమాదానికి గురై గాయపడిన మాధురి
  • ప్రమాదమా? ఆత్మహత్యాయత్నమా? అనే కోణంలో విచారిస్తున్న పోలీసులు
  • తాను డిప్రెషన్‌లో ఉన్నానన్న మాధురి

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చెలరేగిన వివాదానికి కేంద్రబిందువుగా మారిన దివ్వెల మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శ్రీనివాస్ వ్యవహారంపై గత కొన్నిరోజులుగా ఆయన భార్య వాణి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ సమీపంలో మాధురి కారు ప్రమాదానికి గురై... ఆమె గాయపడ్డారు.

టోల్ గేట్ సమీపంలో ఆగి ఉన్న ఓ కారును మాధురి కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. దీంతో ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో ఆమె జూమ్ కాల్ మాట్లాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఇది ప్రమాదమా? ఆత్మహత్యాయత్నమా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధురి మీడియాతో మాట్లాడుతూ... మూడు రోజులుగా తనపై వస్తున్న ట్రోల్స్ తీవ్ర మనస్తాపానికి గురి చేశాయన్నారు. తాను డిప్రెషన్‌‌లో ఉన్నానని, ఆత్మహత్య చేసుకోవడానికే ఇంటి నుంచి బయటకు వచ్చానన్నారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, తానే కారును ఢీకొట్టానన్నారు. వాణి తనపై ఆరోపణలు చేస్తున్నందువల్లే భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు చెప్పారు. వైద్యులు తనకు చికిత్స అందించవద్దని కోరారు. తనపై, తన పిల్లలపై వస్తున్న ట్రోల్స్ తట్టుకోలేకపోతున్నానన్నారు. తాను తర్వాతనైనా సూసైడ్ చేసుకొని చనిపోతానన్నారు. కాగా, తన భర్త మాధురితో ఉంటూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను భార్య దువ్వాడ వాణి ఆరోపిస్తున్నారు.

Divvela Madhuri
Duvvada Srinivas
Srikakulam District
Road Accident
  • Loading...

More Telugu News