Duvvada Family: టెక్కలిలో దువ్వాడ ఇంట్లోనే ఉంటా: దివ్వెల మాధురి

Divvela Madhuri Fires On Duvvad Vani

  • దువ్వాడ తనకు అగ్రిమెంట్ రాసిచ్చాడంటూ వ్యాఖ్యలు
  • ఆయన అక్కడే ఉన్నా లేకున్నా తాను పిల్లలతో నివాసం ఉంటానని వెల్లడి
  • అడ్డుకోవాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని మాధురి బెదిరింపు

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రచ్చకెక్కింది. టెక్కలిలోని ఆయన నివాసంపై తనకు హక్కు ఉందంటే తనకే హక్కు ఉందని దువ్వాడ వాణి, దివ్వెల మాధురి చెబుతున్నారు. తనపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తూ, తనను బజారుకు లాగారని వాణిపై మండిపడ్డారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు బాకీ ఉన్నారని, అగ్రిమెంట్ పేపర్ రాసిచ్చారని చెప్పారు. టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటిపై తనకు హక్కు ఉందని, డాక్యుమెంటరీ ప్రూఫ్ కూడా ఉందన్నారు. శ్రీనివాస్ ఆ ఇంట్లో ఉన్నా సరే, ఇల్లు విడిచిపెట్టి వేరే ఎక్కడైనా ఉన్నా సరే.. తాను మాత్రం అదే ఇంట్లో పై పోర్షన్ లో పిల్లలతో కలిసి ఉంటానని స్పష్టం చేశారు.

తనను అడ్డుకోవాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తన పిల్లల జోలికి వస్తే చెప్పుతో కొడతానంటూ దువ్వాడ వాణిపై మాధురి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తాను టెక్కలికి వెళుతున్నట్లు మాధురి చెప్పారు. కాగా, ఈ విషయంపై దువ్వాడ శ్రీనివాస్ కూతురు హైంధవి మాట్లాడుతూ.. టెక్కలిలోని ఇల్లు తమ తల్లి డబ్బులతో నిర్మించిందని, ఈ ఇంటిపై తమకు హక్కు ఉందని చెప్పారు. తాము ఇంటి ముందు నుంచి వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. ఈ ఇంట్లో దువ్వాడ శ్రీనివాస్ కు ఉండే హక్కు ఉంది అయితే తాము ఇంట్లో ఉండకూడదనే హక్కు మాత్రం ఆయనకు లేదన్నారు.

Duvvada Family
Duvvada Srinivas
Divvela madhuri
Duvvada vani
Tekkali

More Telugu News