Brahmayoni Hill: బీహార్‌లోని బ్రహ్మయొని పర్వతంపై మధుమేహాన్ని తగ్గించే మొక్క గుర్తింపు

Scientists uncover medicinal plants atop hill in Gaya

  • బ్రహ్మయొని పర్వతంపై పలు ఔషధ మొక్కను గుర్తించిన శాస్త్రవేత్తలు
  •  రక్తంలో చక్కెర స్థాయులు తగ్గించే గుణమున్న గుర్మార్ మొక్క
  • దీనితోపాటు మరిన్ని ఔషధ మొక్కలను గుర్తించిన శాస్త్రవేత్తలు

డయాబెటిస్‌ను తగ్గించే లక్షణం ఉన్న గుర్మార్ అనే మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. బీహార్ రాష్ట్రంలోని గయలో ఉన్న బ్రహ్మయొని పర్వతంపై పలు రకాల ఔషధ మొక్కలను గుర్తించిన శాస్త్రవేత్తలు వాటిలో గుర్మార్ మొక్క కూడా ఉన్నట్టు తెలిపారు.

మధుమేహ చికిత్స కోసం బీజీఆర్-34 అనే ఔషధం తయారీకి గుర్మార్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో జిమ్నెమిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పేగులోని పొరపై ఉండే గ్రాహక ప్రదేశాలను నింపేస్తుంది. ఫలితంగా తీపి పదార్థాలు తిన్నాలన్న ఆకాంక్షను తగ్గిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయులు తగ్గడానికి దోహదం చేస్తుంది.

బ్రహ్మయొని పర్వతంపై గుర్తించిన పిథెసెలొబియం డుల్సే, జిపుఫస్ జుజుబా వంటి  మొక్కల్లోని ఔషధ గుణాలపైనా పరిశోధనలు జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి అంతరించిపోకుండా స్థానికుల సాయంతో వాటని సాగు చేయించాలని యోచిస్తున్నారు.

  • Loading...

More Telugu News