Avatar3: అవతార్-3 మూవీ టైటిల్, విడుదల తేదీ ప్రకటన

James Camerons  Avatar 3 Fire And Ash will be released on 19 December 2025

  • అవతార్ 3 మూవీకి ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ పేరు ఖరారు
  • 2025 డిసెంబర్ 19న విడుదల కానున్న చిత్రం
  • కీలక అప్‌డేట్స్ శనివారం అధికారికంగా ప్రకటన

అవతార్-3 సినిమాపై కీలక అప్‌డేట్స్ వచ్చాయి. ‘డిస్నీ డీ23 కన్వెన్షన్‌’ వేదికగా శనివారం ప్రకటించిన పలు సినిమాల విడుదల తేదీలు, టైటిల్స్ జాబితాలో అవతార్-3 కూడా ఉంది. హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ రూపొందిస్తున్న ‘అవతార్ 3’ మూవీకి ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’గా పేరుని ఖరారు చేసినట్టు వెల్లడించారు. ఈ మేరకు అవతార్, డిస్నీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలపై ఈ వివరాలను తెలిపారు. ‘‘అవతార్ తదుపరి సినిమా పేరు ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’. 19 డిసెంబర్ 2025న పండోరకు (సినిమాలోని కల్పిత ఉపగ్రహం) తిరిగి వెళ్లేందుకు థియేటర్లలో సిద్ధంగా ఉండండి’’ అని పేర్కొన్నారు.

ఇదిలావుంచితే అవతార్-3 సినిమాలో జో సల్దానా, సామ్ వర్తింగ్టన్ నటించనున్నారు. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ పేరిట అవతార్-2 భారత్‌లో విడుదలైంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ వంటి భాషలలో విడుదలై ఈ మూవీ ప్రశంసలు అందుకుంది. విమర్శకులు సైతం ప్రశంసలు జల్లు కురిపించారు.

కాగా అవతార్-3కి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో దర్శకుడు జేమ్స్ కామెరూన్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. మూడవ భాగం సినిమాలో కథ.. భూమిని, పండోరను కాపాడే దశలోకి మారుతుందని ప్రకటించారు. ఈ మేరకు పండోర గ్రహం మీద ఇతర సంస్కృతుల కోసం అన్వేషిస్తున్నామని, బ్యాడ్-గయ్ కథను మరింత బలంగా మార్చబోతున్నామని వెల్లడించారు. ఇక సల్లీ కుటుంబానికి సంబంధించిన కొన్ని కొత్త విషయాలు ఉంటాయని ఆయన వివరించారు.

View this post on Instagram

A post shared by Avatar (@avatar)

More Telugu News