Sobhita Dhulipala: ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి.. నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభిత ఫస్ట్ పోస్ట్

Actress Sobhita Dhulipala First Post After Engagement


‘మన పరిచయం ఎలా మొదలైతేనేం.. ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి’ అంటూ నాగ చైతన్యను ఉద్దేశించి నటి శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ ఫొటోలను తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. గురువారం ఉదయం వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడిస్తూ ఫొటోలను షేర్ చేశారు. 

ఇప్పుడు శోభిత నిశ్చితార్థ వేడుక ఫొటోలను షేర్ చేశారు. ‘నా తల్లి నీకేమవుతుంది?.. నా తండ్రి నీకు ఎలాంటి బంధువు? మనం ఎలా కలిస్తేనేం. మన హృదయాలు ఎర్రని భూమిలా వర్షిస్తోంది. విడిపోలేనంతగా అవి కలిసిపోయాయి’ అంటూ తమిళ కవి కురుంతోగై రాసిన పద్యం నుంచి పదాలను తీసుకుని ఫొటోలకు దానిని క్యాప్షన్‌గా తగిలించారు. ఇదే పోస్టును నాగచైతన్య రీపోస్ట్ చేశాడు.

Sobhita Dhulipala
Naga Chaitanya
Tollywood
  • Loading...

More Telugu News