MGM: వరంగల్ ఆసుపత్రిలో దారుణం... పసిగుడ్డును పీక్కుతిన్న కుక్కలు!

Dogs attack on foud day baby

  • నిత్యం జనం తిరిగే ప్రాంతంలోనే ఘటన
  • సగం బాడీని తినేయడంతో గుర్తుపట్టలేని విధంగా పసికందు
  • వివరాలు సేకరిస్తున్న అధికారులు, పోలీసులు

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం జరిగింది. నాలుగు రోజుల పసిగుడ్డును కుక్కలు పీక్కుతిన్నాయి. నిత్యం జనం తిరిగే క్యాజువాలిటీ వార్డు ముందే ఈ ఘటన జరిగింది. అయితే ఈ పసికందును కుక్కలు ఎక్కడినుంచి తీసుకువచ్చాయనే కోణంలో ఆసుపత్రి అధికారులు, పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ఆ పసికందు ఆడనా, మగనా? అనేది తెలియాల్సి ఉంది. సగం బాడీని కుక్కలు తినేయడంతో గుర్తు పట్టడం కష్టంగా ఉంది. పసికందు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఆసుపత్రిలో చేరిన వారి చిన్నారి కాకపోవచ్చునని భావిస్తున్నారు. డెడ్ బాడీని తీసుకువచ్చి ఎంజీఎం పరిసరాల్లో వదిలివేసినట్లు అనుమానిస్తున్నారు.

More Telugu News