MBBS: ఏపీలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

AP Govt will issue notification for medical seets

  • త్వరలో ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ
  • ఈ నెల 16 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలన్న హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్
  • అక్టోబరు 1 నాటికి అడ్మిషన్లు పూర్తి చేస్తామని వెల్లడి

ఏపీలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ చేస్తామని తెలిపారు. 

ఈ నెల 16 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అక్టోబరు 1 నాటికి వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని రాధికా రెడ్డి తెలిపారు. అన్ని వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తామని చెప్పారు.

రాష్ట్రం మొత్తమ్మీద 35 మెడికల్ కాలేజీల్లో 6,210 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అందులో ఎంబీబీఎస్ 'ఏ' కేటగిరీ కింద 3,856 సీట్లు కేటాయించామని వివరించారు. సీట్ల భర్తీ కోసం మూడు విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. 

అటు, రాష్ట్రవ్యాప్తంగా 1,540 బీడీఎస్ సీట్లు భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. వైద్య విద్యా కోర్సుల్లో సీట్ల కోసం ఎవరూ దళారులను ఆశ్రయించవద్దని స్పష్టం చేశారు. 

More Telugu News