Parliament: పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా

Parliament budget session concluded

  • జులై 22న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
  • ఈ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
  • మూడ్రోజులు ముందుగానే ముగిసిన పార్లమెంటు సమావేశాలు 

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ సాయంత్రం పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. జులై 22న ప్రారంభమైన ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు జరగాల్సి ఉన్నా... ముందుగానే ముగిశాయి. చివరగా వక్ఫ్ చట్టం సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్డీయే 3.0 ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది పూర్తి స్థాయి బడ్జెట్. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో నీట్ యూజీ పేపర్ లీకేజి అంశం తీవ్ర రగడకు దారితీసింది. రైల్వే భద్రత అంశం కూడా ఉభయ సభల్లో చర్చకు వచ్చింది.

More Telugu News