Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ అప్పీల్‌పై ఆర్బిట్రేషన్ కోర్టు కీలక ప్రకటన
- అధిక బరువు ఉండటంతో వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు
- తనకు రజతం రావాలంటూ ఆర్బిట్రేషన్ కోర్టుకు ఫొగాట్
- ఒలింపిక్ గేమ్స్ ముగిసేలోగా నిర్ణయం ఉండవచ్చునన్న ఆర్బిట్రేషన్ కోర్టు
ఒలింపిక్స్ గేమ్స్ ముగిసేలోగా భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత పిటిషన్‌పై నిర్ణయం రావొచ్చునని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) వెల్లడించింది. 50 కిలోల విభాగంలో ఫైనల్‌లో పోటీకి సిద్ధమైన ఫొగాట్... 100 గ్రాములు అధికంగా ఉండటంతో అనర్హత వేటు పడింది. దీంతో ఫైనల్లో ఆడలేకపోయింది.
అయితే తనకు రజతం రావాలంటూ తన అనర్హతపై క్రీడా కోర్టులో సవాల్ చేసింది. ఈ అభ్యర్థనను ఆర్పిట్రేషన్ కోర్టు స్వీకరించి, విచారణ జరుపుతోంది. ఒలింపిక్ గేమ్స్ ముగిసేలోగా నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని సీఏఎస్ వెల్లడించింది.
హాకీ జట్టు ఆటగాడికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.1 కోటి నజరానా
పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్యం గెలుచుకుంది. ఈ నేపథ్యంలో భారత హాకీ ఆటగాడు వివేక్ సాగర్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.1 కోటి రివార్డును ప్రకటించింది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉండగా, పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాకదారులుగా స్టార్ షూటర్ మను భాకర్, హాకీ గోల్ కీపర్ శ్రీజేష్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది.