Two Wheelers: టూ వీలర్ మార్కెట్‌లో చైనాను వెనక్కి నెట్టేసిన భారత్!

India to surpass China to become worlds largest 2 wheeler market in 2024

  • భారత్‌లో ఊపందుకున్న ఈవీ టూ వీలర్ మార్కెట్
  • తక్కువ దూరం ప్రయాణించేందుకు వీటినే ఎంచుకున్న వినియోగదారులు
  • టాప్-10 ఈవీ బ్రాండ్లలో సత్తా చాటుతున్న ఓలా, ఎథర్, టీవీఎస్ మోటార్
  • 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 44 శాతానికి ఈవీ టూ వీలర్ అమ్మకాలు

భారతదేశం మరో ఘనత సాధించింది. ద్విచక్ర వాహన మార్కెట్‌లో పొరుగుదేశం చైనాను దాటేసింది. తక్కువ దూరానికి ప్రయాణించేందుకు భారతీయులు ద్విచక్ర వాహనాలను ఎంచుకుంటుండడంతో ఈ మార్కెట్‌లో రోజురోజుకు వృద్ధి నమోదవుతోంది. ఫలితంగా గతం కంటే టూ వీలర్ మార్కెట్ పుంజుకుంది. ఫలితంగా ఇప్పటి వరకు ఈ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న చైనాను భారత్ అధిగమించింది.

భారత్‌లో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఫోర్ వీలర్ ఈవీ మార్కెట్ కంటే ద్విచక్ర వాహనాల ఈవీ మార్కెట్ 1.5 రెట్లు పెరుగుతుందని అంచనా. నిరుడు ద్విచక్ర వాహన విక్రయాలు ఒకశాతం కంటే తక్కువగా పెరిగాయి. అదే సమయంలో ఈవీ టూ వీలర్స్ విక్రయాలు పెరిగాయి. 2024 తొలి త్రైమాసికంలో టూవీలర్ ఈవీల విక్రయం పావు వంతకుపైగా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

2025 నాటికి ఇండియాతోపాటు ఆగ్నేయాసియా దేశాలు ఈవీ వాహనాల విషయంలో గణనీయమైన వృద్ధి సాధిస్తాయని సీనియర్ విశ్లేషకుడు సౌమెన్ మండల్ పేర్కొన్నారు. ఇక, ఇండియాలో టాప్-10 ఈవీ టూ వీలర్ బ్రాండ్‌లలో ఓలా, టీవీఎస్ మోటార్, ఎథర్ ఎనర్జీ ముందు వరుసలో ఉన్నాయి. ఈ విషయంలో టీవీఎస్, హీరో, బజాజ్ వంటి దిగ్గజ సంస్థలకు ఓలా, ఎథర్‌ కంపెనీలు సవాలు విసురుతున్నాయి. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా టూ వీలర్ ఈవీ సేల్స్ వాటా 44 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, 2024-30 మధ్య  ఈవీ టూ వీలర్ విక్రయాలు 150 మిలియన్ యూనిట్లకు చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News