Paris Olympics 2024: భార‌త్‌ను వెన‌క్కి నెట్టిన‌ పాక్‌.. ఒక్క గోల్డ్ మెడ‌ల్‌తో అంతా మారిపోయిందిగా!

Pakistan Overtakes India on Paris Olympics 2024 Medal Tally After Arshad Nadeem Gold Medal

  • ఐదు ప‌త‌కాలు గెలిచిన భారత్‌కు 64వ స్థానం 
  • ఒక ప‌త‌కం సాధించి 53వ స్థానానికి ఎగ‌బాకిన పాకిస్థాన్‌
  • జావెలిన్ త్రోలో స్వ‌ర్ణం గెల‌వ‌డంతో ప‌త‌కాల ప‌ట్టిక‌లో దూసుకెళ్లిన పాక్‌
  • ఒకే ఒక్క గోల్డ్ ఎంత‌టి మార్పును తీసుకొచ్చిందంటూ నెటిజ‌న్ల కామెంట్స్‌

పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త్‌ను పాకిస్థాన్ అధిగ‌మించింది. ఐదు ప‌త‌కాలు (ఒక ర‌జ‌తం, నాలుగు కాంస్యం) సాధించిన భారత్ 64వ స్థానంలో ఉంటే.. కేవ‌లం ఒక ప‌త‌కం (స్వ‌ర్ణం) సాధించిన దాయాది పాక్ 53వ స్థానానికి చేరింది. గురువారం రాత్రి జ‌రిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైన‌ల్‌లో ఆ దేశానికి చెందిన అర్షద్ నదీమ్ అనూహ్య రీతిలో గోల్డ్ మెడ‌ల్ కైవ‌సం చేకున్నాడు. జావెలిన్‌ను ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి మొద‌టి స్థానంలో నిల‌వ‌డంతో స్వర్ణ ప‌త‌కం ద‌క్కింది. దాంతో ఆ దేశం ప‌త‌కాల ప‌ట్టిక‌లో ఒక్క‌సారిగా పైకి ఎగ‌బాకింది. ఒకే ఒక్క గోల్డ్ ఎంత‌టి మార్పును తీసుకొచ్చిందంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. 

'ఒక్క గోల్డ్‌తో అంతా మారిపోయింది. 32 ఏళ్ల త‌ర్వాత ప‌త‌కాల ప‌ట్టిక‌లో భార‌త్‌ను పాక్ వెన‌క్కి నెట్టిందంటూ' ఓ నెటిజ‌న్ కామెంట్ చేశారు. 'ఒలింపిక్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం గొప్ప‌ద‌నం ఇదీ. పాక్ ఒక్క మెడ‌ల్‌తో భార‌త్‌ను అధిగ‌మించింది' అని మ‌రొక‌రు కామెంట్ చేశారు. 'ఒకేఒక్క గోల్డ్ మెడ‌ల్‌తో పాకిస్థాన్.. భార‌త్‌ను ప‌ది స్థానాలు వెన‌క్కి నెట్టిందంటూ' ఇంకొక‌రు కామెంట్ చేశారు. 'గోల్డ్ ఈజ్ అల్వేస్ గోల్డ్. ఐదు ప‌త‌కాలు గెలిచిన భార‌త్ 64వ స్థానంలో ఉంటే.. ఒక్క మెడ‌ల్‌తో పాకిస్థాన్ 53వ స్థానానికి చేరిందని' మ‌రోక‌రు కామెంట్ చేశారు.

  • Loading...

More Telugu News