Nara Lokesh: ఏపీలో ఐటీ, పరిశ్రమ అభివృద్ధి చర్యలపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష

Minister Nara Lokesh reviews IT and industry development measures in AP

  • ఐటీ అభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు 10 అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో చర్చిస్తానన్న మంత్రి 
  • రియల్ టైం గవర్నెన్స్‌ను మరింత మెరుగ్గా రూపొందించాలని అధికారులకు సూచన
  • తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్‌ అభివృద్ధితో పాటు విడి భాగాల తయారీ యూనిట్స్ ఏర్పాటుకు కృషి చేయాలని సలహా

ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. పెట్టుబడిదారులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించారు. ఈ మేరకు గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో భేటీ అయ్యారు. రియల్ టైమ్ గవర్నెన్స్‌ను (ఆర్టీజీఎస్) మరింత మెరుగ్గా రూపుదిద్దాలని అధికారులకు ఆయన సూచించారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి, పరిశ్రమల స్థాపన కోసం దేశంలోని టాప్ 10 మంది పారిశ్రామిక వేత్తలతో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇన్నోవేషన్ సెంటర్లలో ప్రోత్సాహకాలు అందించి స్టార్టప్‌లకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని మరింత మెరుగుపర్చాలని మంత్రి నారా లోకేశ్ అన్నారు. తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్లను అభివృద్ధి చేయడంతో పాటు విడి భాగాలు తయారు చేసే యూనిట్లను నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఐటీ కార్యదర్శి సౌరభ్ గౌడ్, ఎండీ ఏపీటీఎస్ రమణారెడ్డి, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ డి వెంకటాచలం, ఐటీ జాయింట్ సెక్రటరీ సూర్జిత్ సింగ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News