Pushpa2 The Rule: 'పుష్ప‌-2' నుంచి అదిరిపోయే అప్‌డేట్‌!

Fahadh Faasil New Look from Pushpa2 The Rule

  • నేడు మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ బ‌ర్త్‌డే
  • దాంతో 'పుష్ప‌-2' నుంచి ఆయ‌న పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్‌ 
  • పోస్ట‌ర్‌లో మాస్ లుక్‌లో అద‌ర‌గొట్టిన భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్‌

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప‌-2 నుంచి తాజాగా మేక‌ర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీలో ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్న మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. 

పుష్ప చిత్రంలో ఆయ‌న భన్వర్ సింగ్ షెకావత్ అనే ఐపీఎస్ పోలీస్ అధికారి పాత్రలో నటించిన విష‌యం తెలిసిందే. ఇవాళ ఫ‌హాద్ పుట్టిన‌రోజు కావ‌డంతో బర్త్‌ డే విషెస్‌ చెబుతూ మూవీలోని ఆయ‌న లుక్‌ను చిత్రం యూనిట్‌ విడుదల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో భ‌న్వ‌ర్ సింగ్‌ గా మాస్ లుక్‌లో అద‌ర‌గొట్టారు. 

షెకావత్‌ సార్‌ ఈసారి గుండీలు విప్పేసిన ఖాకీ చొక్కా వేసుకుని, లుంగీ కట్టి... ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో తుపాకీ పట్టుకొని కనిపించాడు. ఈసారి ఆయ‌న‌ను లెక్క‌ల మాస్టారు (సుకుమార్) మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా చూపించ‌బోతున్నాడ‌ని ఈ పోస్ట్ చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. 

ఇక ఇప్పటికే మేక‌ర్స్ ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విష‌యం తెలిసిందే. 

బ‌న్నీ స‌ర‌స‌న హీరోయిన్‌గా కన్నడ భామ రష్మిక మందన్న న‌టిస్తున్న ఈ మూవీకి రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, అజయ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More Telugu News