Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ పొడిగింపు

Kejriwal CBI custody extended


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఈ నెల 20 వరకు కేజ్రీవాల్ కు సీబీఐ కేసులో కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణకు హాజరుపరిచారు. 

కాగా, లిక్కర్ స్కాం కేసులో తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు సోమవారం నాడు కొట్టివేసిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేయగా, సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్ ప్రస్తుతం సీబీఐ కేసులో జైలులో ఉన్నారు.

Arvind Kejriwal
CBI
Custody
AAP
New Delhi
  • Loading...

More Telugu News