Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం.. ప‌లు కీల‌క నిర్ణ‌యాలు

TDP Politburo Meeting in Guntur

  • ఎన్‌టీఆర్ భవన్‌లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
  • జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణతో పాటు జన్మభూమి-2 ప్రారంభంపై చర్చ
  • రాష్ట్రంలో పేదరిక నిర్మూలనపై విస్తృత చ‌ర్చ 

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గుంటూరు జిల్లాలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్‌టీఆర్ భవన్‌లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఈ భేటీ జ‌రిగింది. ఇందులో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ చేపట్ట‌డంతో పాటు జన్మభూమి-2ను అతి త్వరగా ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో పేదరిక నిర్మూలనపై విస్తృతంగా చ‌ర్చించారు. దీంతో పాటు అతి త్వరలోనే మొదటి దశ నామినేటెడ్‌ పదవుల భర్తీ చేయాలని చంద్ర‌బాబు నిర్ణయించడం జ‌రిగింది.

Chandrababu
TDP Politburo Meeting
NTR Bhavan
Guntur
Andhra Pradesh
  • Loading...

More Telugu News