Ukraine-Russia War: రష్యాలోకి పెద్ద ఎత్తున ఉక్రెయిన్ దళాలు.. యుద్ధం భీకరంగా కొనసాగుతోందన్న రష్యా

Russia Says Ukraine Launched Missiles Drones Shot Down Over Kursk Region

  • కుర్స్క్ ప్రాంతం మీదుగా రష్యాలోకి ఉక్రెయిన్ దళాలు
  • 300 బలగాలు, 11 ట్యాంకులు, 20కిపైగా సాయుధ వాహనాలతో సరిహద్దు దాటిన ఉక్రెయిన్
  • ఉక్రెయిన్ దాడుల్లో ఐదుగురు చనిపోయారన్న రష్యా
  • రెండు క్షిపణులను కూల్చేశామని ప్రకటన

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం భీకర స్థాయికి చేరుకుంటోంది. ఉక్రెయిన్ అనుకూల దళాలు రష్యా కుర్స్క్‌లోని నైరుతి ప్రాంతంలోకి ప్రవేశించాయి. ట్యాంకులు, సాయుధ దళాలతో అవి సరిహద్దును దాటినట్టు రష్యా తెలిపింది. క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ చేస్తున్న దాడిని తిప్పికొడుతున్నామని, భీకర యుద్ధం జరుగుతోందని పేర్కొంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ సైనికులు ఇంత పెద్ద ఎత్తున రష్యాలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ ప్రయోగించిన రెండు క్షిపణులను తమ వాయు రక్షణ సంస్థ కూల్చివేసినట్టు  కుర్స్క్ ప్రాంతీయ గవర్నర్ అలెక్సీ స్మిర్‌నోవ్ తెలిపారు.
 
300 బలగాలు, 11 ట్యాంకులు, 20కిపైగా సాయుధ వాహనాలతో రాత్రికి రాత్రే ఉక్రెయిన్ దళాలు తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్టు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. తమ బలగాలు, వాయు దళాలను సరిహద్దులకు పంపినట్టు పేర్కొంది. ఉక్రెయిన్ దాడిలో ఐదుగురు చనిపోయారని, 28 మందికి గాయాలయ్యాయని పేర్కొంది.  ఉక్రెయిన్ డ్రోన్లు పౌర నివాసాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్టు స్థానిక అధికారులు ఆరోపించారు.

  • Loading...

More Telugu News