Sonia Gandhi: సోనియా గాంధీని కలిసిన డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్

Double Olympic Medalist Manu Bhaker meets Sonia Gandhi

  • పారిస్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న మను భాకర్
  • విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అభిమానులు
  • సాయంత్రం సోనియా గాంధీ నివాసంలో ఆమెను కలిసిన మను భాకర్

పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏస్ షూటర్ మను భాకర్ భారత్ చేరుకుంది. ఈ యువ షూటర్ ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి చేరుకొని ఆమెను కలిసింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను భాకర్‌ను కాంగ్రెస్ అగ్రనాయకురాలు అభినందించారు. పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ రెండు కాంస్య పతకాలు సాధించడం తెలిసిందే.

మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో, సరబ్ జోత్ సింగ్‌తో కలిసి మిక్స్ డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యాలు సాధించిన మను భాకర్... మహిళల 25 మీటర్ల విభాగంలో తృటిలో పతకం కోల్పోయింది. ఈరోజు ఆమె పారిస్ నుంచి నేరుగా ఢిల్లీకి ఎయిరిండియా విమానంలో వచ్చారు. ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

Sonia Gandhi
Congress
Manu Bhaker
  • Loading...

More Telugu News