Ram Charan: డ‌బ్బింగ్ ప‌నులు షురూ చేసిన రామ్ చరణ్ 'గేమ్‌ చేంజ‌ర్‌' టీమ్

Ram Charan Game Changer dubbing works has started

  • రామ్ చరణ్, శంకర్ కాంబోలో గేమ్ చేంజర్
  • ఈ ఏడాది క్రిస్మస్ కు ప్రేక్షకుల ముందుకు వస్తున్న పాన్ ఇండియా చిత్రం
  • పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులు ప్రారంభం 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, జరగండి జరగండి.. సాంగ్‌, ఇటీవలి అప్ డేట్లతో గేమ్ చేంజ‌ర్‌ చిత్రంపై మరింత హైప్ ఏర్పడింది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ఈ భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. 

తాజాగా గేమ్ చేంజ‌ర్ డ‌బ్బింగ్ ప‌నులు షురూ అయ్యాయి. పూజా కార్య‌క్ర‌మాల‌తో డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టారు. "ఆల్ సెట్ ఫ‌ర్ ద మెగా ఫైర్ వ‌ర్క్స్- క్రిస్మ‌స్ 2024" అంటూ డ‌బ్బింగ్ ప్రారంభించిన విష‌యాన్ని మేక‌ర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

'విన‌య విధేయ రామ' చిత్రంలో క్యూట్ జోడీగా మెప్పించిన రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ... గేమ్ చేంజ‌ర్‌లోనూ అల‌రించ‌టానికి రెడీ అయ్యారు. ఇటీవలే గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజర్ లో త‌న పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసేశారు. డైరెక్టర్ శంకర్ మిగిలిన చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. లార్జ‌ర్ దేన్ లైఫ్ చిత్రాల‌ను అబ్బుర‌ప‌రిచే రీతిలో తెర‌కెక్కించే శంకర్ ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా ‘గేమ్ చేంజ‌ర్‌’ను రూపొందిస్తున్నారు. 

గేమ్ చేంజర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ ప్రైజ్‌కి దక్కించుకుంది.

More Telugu News