Vijay Bhaskar: తరుణ్ అందుకే వెనకబడ్డాడేమో: డైరెక్టర్ విజయ్ భాస్కర్

Vijay Bhaskar Interview

  • వరుస హిట్లు ఇచ్చిన విజయ్ భాస్కర్ 
  • తరుణ్ తో చేసిన 'నువ్వేకావాలి'
  • యాక్షన్ దిశగా తరుణ్ ఆలోచించాడని వెల్లడి  
  • అతనిని తప్పుబట్టలేమని వ్యాఖ్య  


విజయ్ భాస్కర్ కెరియర్ ను పరిశీలిస్తే, దర్శకుడిగా ఆయన అందించిన వరుస హిట్లు కళ్లముందు కదలాడతాయి. స్వయంవరం .. నువ్వేకావాలి .. నువ్వు నాకు నచ్చావ్ .. మల్లీశ్వరి ఇలా ఒకానొక దశలో వరుస హిట్లను ఇస్తూ ఆయన దూసుకుపోయారు. ఆయన నుంచి వచ్చిన సూపర్ హిట్స్ లో తరుణ్ హీరోగా చేసిన 'నువ్వేకావాలి' కూడా కనిపిస్తుంది. 

తరుణ్ ను హీరోగా పరిచయమైంది విజయ్ భాస్కర్ దర్శకత్వంలోనే. ఆ తరువాత తరుణ్ స్టార్ హీరోగా చాలా కాలం పాటు తన జోరు చూపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ కొన్ని హిట్స్ తరువాత తరుణ్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఆ తరువాత ఆయన సినిమాలకు దూరంగా వెళ్లిపోయాడు. తరుణ్ వెనుకబడిపోవడానికి కారణం ఏమిటనే ప్రశ్న విజయ్ భాస్కర్ కి ఎదురైంది. 

అందుకు ఆయన స్పందిస్తూ .. "తరుణ్ చాలా ఇంటెలిజెంట్. తరుణ్ యాక్షన్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఆ తరువాత ఆ తరహా సినిమాలేవో ఒకటి రెండు చేసినట్టు ఉన్నాడు. అలాంటి సినిమాలే చేయాలనేం లేదు .. నీ సినిమాలు నీకు ఉంటాయి .. నీ ఆడియన్స్ నీకు ఉంటారు .. నీ ఐడెంటిటీ నీకు ఉంటుందని నేను చెప్పాను. ఈ విషయంలో తనది తప్పని కూడా చెప్పలేం. కొన్నిసార్లు కుదురుతుంది .. కొన్నిసార్లు కుదరవు అంతే" అని చెప్పారు. 

Vijay Bhaskar
tarun
Nuvve Kavali
  • Loading...

More Telugu News