Jayalalitha: శరత్ బాబుతో పెళ్లైంది .. కానీ ఆయన నాకు ఏమీ ఇవ్వలేదు: జయలలిత!

Jayalalitha Interview

  • అందాల నటిగా జయలలితకి పేరు 
  • ఆమెకి వరుస అవకాశాలు ఇచ్చిన వంశీ 
  • శరత్ బాబు వెనుకంజ వేశారని వ్యాఖ్య 
  • దేనికైనా ప్రాప్తం ఉండాలన్న జయలలిత  


జయలలిత .. అందమైన కేరక్టర్ ఆర్టిస్టుగా తెరపై సందడి చేసిన నటి. అలాంటి ఆమె అడపా దడపా మాత్రమే తెరపై కనిపిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో జయలలిత మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నా అసలు పేరు లలిత ..  దానికి ముందు 'జయ' పెట్టుకుంది నేనే" అని అన్నారు. 

"మద్రాసులో ఉన్నప్పుడు నా పేరు మార్చుకోమని 'అమ్మ పార్టీ' వారు నన్ను బెదిరించారు కూడా. అమ్మ పేరు పెట్టుకుని కామెడీ వేషాలు వేయడానికి వీల్లేదని హెచ్చరించారు. 'ఆలాపన' సినిమా సమయంలో వంశీ గారిని కలిశాను. అప్పటి నుంచి ఆయన నాకు వరుసగా అవకాశాలు ఇస్తూనే వచ్చారు. అలా నేను నిలదొక్కుకోవడంలో ఆయన పాత్ర ఉంది. ఆ తరువాత జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. ప్రేమకోసం తపించాను .. కానీ అది దొరకలేదు." అని చెప్పారు. 

"శరత్ బాబుగారితో పెళ్లి అయింది. ఇద్దరం కలిసి చాలా యాత్రలకు వెళ్లాము. ఆయనతో ఉన్న ఎనిమిదేళ్లలో ఆయన నాకు ఏమీ ఇవ్వలేదు. ఆయన చాలా అందంగా ఉండేవారు .. ఆయన వలన ఒక బాబు పుడితే బాగుంటుందని అనుకున్నాను. మొదట ఆయన సుముఖతను వ్యక్తం చేశారు. కానీ ఆ తరువాత వెనుకంజ వేశారు. జీవితంలో ఇల్లు .. పెళ్లి .. పిల్లలు అనేవి ఉండటానికి ప్రాప్తం ఉండాలి. అవి ఈ జీవితానికి లేనట్టే" అని అన్నారు. 

Jayalalitha
Sharath Babu
Tollywood
  • Loading...

More Telugu News