Harish Shankar: హీరో నరుకుతూ వెళ్లడం వలన సినిమాలు ఆడవ్: హరీశ్ శంకర్

Harish Shankar Interview

  • హరీశ్ శంకర్ నుంచి 'మిస్టర్ బచ్చన్'
  • మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ జోనర్లో నడిచే కథ 
  • రవితేజ జోడీకట్టిన భాగ్యశ్రీ బోర్సే
  • ఈ నెల 15వ తేదీన విడుదల కానున్న సినిమా


హరీశ్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా చేసిన 'మిస్టర్ బచ్చన్' ఈ నెల 15వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో హరీశ్ శంకర్ బిజీగా ఉన్నాడు. సాధారణంగా హరీశ్ శంకర్ సినిమాల్లో మాస్ యాక్షన్ సీన్స్ ఫుల్లుగా ఉంటాయి. 'ఒక్క హీరో అంతమందిని నరకడం సహజత్వానికి చాలా దూరం గదా'? అనే ప్రశ్న సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఆయనకి ఎదురైంది.
 
అందుకు హరీశ్ శంకర్ స్పందిస్తూ .. 'మగధీర' సినిమాలో ఒక్కొక్కరినీ కాదు షేర్ ఖాన్ వందమందిని పంపించమని హీరో అంటాడు. వందమందిని ఎలా చంపుతాడని ఆడియన్స్ అనుకోలేదు. 'సలార్' సినిమాలోనూ హీరో ఎంతోమందిని నరుక్కుంటూ వెళతాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. కాబట్టి హీరో ఎంతమందిని నరుకుతున్నాడు? అది సాధ్యమేనా .. కాదా? అనేది పక్కన పెడితే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు" అని అన్నాడు. 

" హీరో నరుకుతూ వెళ్లడం వలన సినిమాలు ఆడవు. ఎంతటి భారీ యాక్షన్ సీన్ వెనుక అయినా భయంకరమైన ఒక ఎమోషన్ ఉంటే కనుక ఆడియన్స్ వేరే విషయాలను గురించి ఆలోచించరు. ఒక్కోసారి ఎమోషన్ ఉన్నప్పటికీ ఆ సీన్ పండకపోవచ్చు. స్క్రిప్ట్ లో అనుకున్న ఎమోషన్ తెరపై కనిపించకపోవచ్చు. అప్పుడు ఎవరూ చేసేది ఏమీ లేదు" అని చెప్పాడు. 

Harish Shankar
Bhagyasree
Raviteja
  • Loading...

More Telugu News