Dorababu: వైసీపీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే రాజీనామా

Dorababu resigns from YSRCP

  • పిఠాపురంలోని తన నివాసం వద్ద మీడియాకు తెలిపిన దొరబాబు
  • నియోజకవర్గం అభివృద్ధి కోసం కూటమితో కలిసి పని చేస్తానని వెల్లడి
  • ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని త్వరలో వెల్లడిస్తానన్న దొరబాబు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పిఠాపురంలోని తన నివాసం వద్ద ఆయన మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను ఎన్డీయే కూటమితో కలిసి పని చేస్తానని తెలిపారు. ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని త్వరలో వెల్లడిస్తానన్నారు.

దొరబాబు పిఠాపురం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో బీజేపీ అభ్యర్థిగా, 2019లో వైసీపీ నుంచి గెలిచారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలిచారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌పై వంగా గీతను వైసీపీ బరిలోకి దింపింది.

గత ఎన్నికల్లో తనకు కాదని వంగా గీతకు టిక్కెట్ ఇవ్వడం, ఆమె పార్టీ కార్యాలయాన్ని తమ సమీపంలోనే ఏర్పాటు చేయడంతో దొరబాబు అసంతృప్తికి గురయ్యారు. ఎన్నికలకు ముందే పార్డీని వీడాలని ఆయన భావించారు. కానీ జగన్ ఆయనను బుజ్జగించారు. దీంతో ఎన్నికల్లో దొరబాబు అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు.

Dorababu
Pithapuram
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News