Rupa Lakshmi: ఎన్టీఆర్ ప్రశంసలను మర్చిపోలేను: 'బలగం' రూపలక్ష్మి

Rupa Lakshmi Interview

  • 'బలగం' సినిమాతో రూపలక్ష్మికి పేరు 
  • ఆ తరువాత పెరిగిన అవకాశాలు
  • 'దేవర'లో చేసినట్టు చెప్పిన నటి 
  • 'బలగం' భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అంటూ వ్యాఖ్య 


రూపలక్ష్మి .. 'బలగం' సినిమా చూసినవారికి ఆమెను గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న చిన్న పాత్రలను చేస్తూ తన కెరియర్ ను మొదలుపెట్టిన రూపలక్ష్మికి, 'బలగం' సినిమాతో మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆమెను అంతా గుర్తిస్తున్నారు. తాజాగా 'సిగ్నేచర్ స్టూడియోస్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కెరియర్ గురించిన  విషయాలను పంచుకున్నారు. 

" నాకు ముందున్న సీనియర్ ఆర్టిస్టుల నుంచి నేను క్రమశిక్షణను నేర్చుకున్నాను. అలాగే నేను ఒప్పుకున్న పాత్రకి న్యాయం చేయడం కోసమే చివరివరకూ ప్రయత్నిస్తాను. 'దేవర' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేశాను. ఆ పాత్రకి నన్ను తీసుకోమని ఎన్టీఆర్ చెప్పారని అన్నారు. ఆ విషయం నాకు ఎంతో ఆనందాన్నీ .. ఆశ్చర్యాన్ని కలిగించింది" అని అన్నారు. 

"ఆ తరువాత నేను ఎన్టీఆర్ గారిని కలిశాను. అప్పుడు ఆయన 'బలగం' సినిమాను గురించి ప్రస్తావించారు. ఆ సినిమాలో చాలా బాగా చేశారంటూ నన్ను ప్రశంసించినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఈ రోజున నేను ఈ స్థాయి వరకూ వెళ్లడానికి కారణం 'బలగం' సినిమానే. బలగం సినిమా నాకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్" అని చెప్పారు.

More Telugu News