Chilaka Radha: కల్పనారాయ్ కష్టాలకు అదే కారణం: నటి చిలక రాధ

Chilaka Radha Interview

  • హాస్యనటిగా ఆకట్టుకున్న కల్పనా రాయ్ 
  • ఆమెకి ముందు చూపులేదన్న చిలక రాధ
  • పెంచుకున్న పిల్లలు వెళ్లిపోయారని వెల్లడి 
  • అందుకనే ఆర్ధిక ఇబ్బందులు పడిందని వ్యాఖ్య


తెలుగు తెరపై హాస్య నటిగా తనదైన ముద్రవేసిన కల్పనా రాయ్ ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. తనబాడీ లాంగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో ఆమె ప్రేక్షకులను హాయిగా నవ్వించారు. అలాంటి కల్పనా రాయ్ చివరి రోజులలో ఆర్ధిక పరమైన ఇబ్బందులు పడవలసి వచ్చింది. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి చిలక రాధ మాట్లాడుతూ ఆమె గురించి ప్రస్తావించారు. 

"అప్పట్లో శ్రీలక్ష్మీ .. కల్పనా రాయ్ కాంబినేషన్లో నేను ఎక్కువ సినిమాలు చేశాను. అందువలన వాళ్లతో నాకు సాన్నిహిత్యం ఉండేది. కల్పనా రాయ్ చివరి రోజులలో ఆర్ధికంగా చాలా ఇబ్బందిపడ్డారు. ఆ తరువాత ఆమె చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. కల్పనా రాయ్ కి అప్పట్లో అవకాశాలు బాగానే ఉండేవి. కానీ ఆమె వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే ఖర్చు చేసేది" అని అన్నారు. 

కల్పనా రాయ్ చుట్టూ కొంతమంది చేరేవారు. వాళ్ల వలన కూడా ఆమె వాస్తవాన్ని గ్రహించలేకపోయింది. రోజులు ఎప్పటికీ ఇలాగే ఉంటాయనే ఉద్దేశం కారణంగా ఆమె ముందు జాగ్రత్త పడలేదు. పిల్లలను పెంచుకుంది గానీ, వాళ్లు మధ్యలోనే వెళ్లిపోయారు. డబ్బు విషయంలో నేను జాగ్రత్తగా ఉండటానికి కారణం అన్నపూర్ణనే"అని చెప్పారు.  

More Telugu News